నీకేందుకు సినిమాలు, ఏం సాధిస్తావ్ అంటూ మొహం మీదే అనేది: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2023-10-20 14:52:04.0  )
నీకేందుకు సినిమాలు, ఏం సాధిస్తావ్ అంటూ మొహం మీదే అనేది: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి సుపరిచితమే. ఈ నటి ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా.. డిఫరెంట్ కథలను ఎంచుకుని ప్రేక్షకులను అలరిస్తుంటుంది. నిత్య ఇటీవల ‘కుమారి శ్రీమతి’ చిత్రంలో నటించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 30 ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపని అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే, తాజాగా నిత్య ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించింది.

‘నా తల్లిదండ్రులు నాకు చాలా ఫీడ్రమ్ ఇచ్చారు. పెళ్లి విషయంలో నన్ను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్లు. కానీ ఒక మా నానమ్మ మాత్రం ఎప్పుడు వివాహం చేసుకుంటావ్ ఇంకా అని బాగా టార్చర్ చేసేది. ఆమె, నన్ను కనీసం నటిగా కూడా నన్ను గుర్తించేది కాదు. నువ్వు ఏం చేస్తున్నావ్‌..? జీవితంలో ఏం సాధించావ్‌..? పెళ్లి చేసుకోవచ్చు కదా..? అని ఎప్పుడూ అనేది’’. ఈ సిరీస్‌లో నా తల్లి పాత్ర పోషించిన గౌతమి నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తూ ఉంటే.. అచ్చం మా బామ్మలా అనిపించేదంటూ నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఏకంగా తమ పిల్లలతోనే ఆ పని చేయబోతున్నా రేణుదేశాయ్.. ఒక్కసారిగా బాంబ్ పేల్చేసిందిగా!

Advertisement

Next Story