సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన స్టార్ హీరోయిన్.. భారీగా నగదు మాయం!

by Hamsa |   ( Updated:2023-03-09 09:55:30.0  )
సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన స్టార్ హీరోయిన్.. భారీగా నగదు మాయం!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. నగ్మా మొబైల్‌కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. అయితే అందులో ఉన్న లింక్‌ను నగ్మా క్లిక్ చేయగా.. ఓ వ్యక్తి కాల్ చేసి బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కేవైసీ కంప్లీట్ చేయడానికి గైడ్ చేస్తానని చెప్పాడు. అతడిని నమ్మిన నగ్మా బ్యాంకు నుండి దాదాపు రూ. 1 లక్ష రూపాయలు కొట్టేశాడు. దీంతో నగ్మా మొబైల్‌కి అనేక ఓటీపీలు వచ్చాయట. అది గమనించి నగ్మా వెంటనే అలర్ట్ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నగ్మా సినిమాల విషయానికి వస్తే అప్పట్లో స్టార్ హీరోలతో తెలుగు, హిందీ బాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

ఇవి కూడా చదవండి : పోలీస్ అధికారిని చూస్తే రక్తం మరుగుతోంది.. మంచు లక్ష్మీ పోస్ట్

Advertisement

Next Story