- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: పవన్‌కళ్యాణ్ పై స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..సైలెంట్‌గా ఉండి అలా చేస్తాడంటూ
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద తమదైన ముద్ర వేసి.. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. నువ్వే నువ్వే, ఠాగూర్, చెన్నకేశవ రెడ్డి, శివాజీ, సంతోషం, గౌతమి పుత్ర శాత కర్ణి, ఛత్రపతి, మనం, గమనం, బాలు లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఈమె ఖాతాలో వేసుకుంది. దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలా ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. కానీ, నిత్యం నిత్యం సోషల్ మీడియలో యాక్టీవ్‌గా ఉంటూ ఇప్పటికీ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్‌లోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా పలు విషయాల గురించి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం పట్ల నేనెంతో గర్వంగా ఉన్నాను. ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రజలకు మంచి చెయ్యాలని తాపత్రయపడుతుంటారు. చాలా సైలెంట్‌గా ఉండి ఎక్కువగా శ్రమపడతారు. రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించబోతున్నారని చెప్పింది”.
అలాగే బాలు షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా మాట్లాడుతూ.. ఒక సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నప్పుడు పవన్ కాలికి గాయమయ్యిందని.. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా సాంగ్‌ని కంప్లీట్ చేసారని కూడా చెప్పుకొచ్చింది. అలాగే చిరంజీవితో కలిసి మరోసారి నటించాలని ఈ భామ తన కోరికను బయట పెట్టింది. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ మూవీకి కమిట్ అయ్యానని వెల్లడించింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వగా.. పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.