- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rajinikanth: బాలయ్య కంటిచూపుతోనే చంపేస్తాడు: రజినీకాంత్ పొగడ్తల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో జరుగుతోన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్టార్ హీరో రజినీకాంత్ హాజరయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, బాలకృష్ణలతో కలిసి రజినీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజినీకాంత్ నందమూరి బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ తనకు మంచి మిత్రుడుని ఈ సందర్భంగా రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో బాలయ్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందని.. బాలయ్య కంటిచూపుతోనే చంపేస్తాడు అని ప్రశసించారు. అంతేకాకుండా సినిమాల్లో బాలకృష్ణ చేసే కొన్ని ఫీట్లు బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్‌ఖాన్, సల్మాన్, అమితాబ్, నేను చేసినా జనం ఒప్పుకోరని బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించాడు రజినీకాంత్.
ఎన్టీఆర్ యుగపురుషుడు..
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్ హీరో రజినీ కాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి’’ అని ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని.. ఓ సారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారని రజినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేశానని.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశానని తెలిపారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని రజినీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, నా అనుభవం చెబుతోంది.. ఈ వేదికపై రాజకీయం మాట్లాడొద్దని.. నేను రాజకీయం గురించి మాట్లాడితే ఏమేమో రాసేస్తారు అని రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
Rajinikanth: NTR ఒక యుగ పురుషుడు: రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్