అడుగు దూరంలో.. ఆ పదవిలో నెక్స్ట్ నువ్వే అంటూ పవన్‌పై స్టార్ క్రికేటర్ సెన్సేషనల్ కామెంట్!

by Jakkula Samataha |
అడుగు దూరంలో.. ఆ పదవిలో నెక్స్ట్ నువ్వే అంటూ పవన్‌పై స్టార్ క్రికేటర్ సెన్సేషనల్ కామెంట్!
X

దిశ, సినిమా : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం (నిన్న) రోజున చంద్రబాబు నాయుడు, నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన తర్వాత మరో 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీసీఎం, హోంశాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికేటర్ అంబటి రాయుడు సెన్సేషనల్ ట్వీట్ చేశారు.

ఆయన తన ఎక్స్ ఖాతాలో‘‘ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గర్వంగా ఉంది, భవిష్యత్తులో మిమ్ముల్ని సీఎంగా చూడాలనే మా కలకు పవన్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. జనసేనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఇదో గొప్ప రోజూ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెటర్‌గా రిటైర్ మెంట్ ఇచ్చిన తర్వారత వైసీపీలో చేరారు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా వారం రోజులకే పార్టీని వీడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed