చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి IAS ఆఫీసర్‌గా స్టార్ నటి..!

by Anjali |
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి IAS ఆఫీసర్‌గా స్టార్ నటి..!
X

దిశ, సినిమా: సినిమాల్లోకి వచ్చిన వారి జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు సినిమలు హిట్ అయితే చాలు రిచ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. కానీ, అయితే ఇక్కడ అవకాశాలు రావడం ప్రధాన సమస్య. వరుసగా హిట్‌లు కొట్టే వారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఒకటి రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు వాళ్లవైపు ఏ ప్రొడ్యూసర్ కన్నెత్తి కూడా చూడరు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ప్రయాణం కూడా అంత సులువు కాదు. కొందరు ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడి సక్సెస్ అవుతారు.

మరికొందరు చిన్న చిన్న సమస్యలనే దాటలేక వెనుదిగిరి వెళ్లిపోతారు. అలా వెళ్లిన వారిలో కొందరు జీవితంలోనూ ఫెయిల్ అవ్వగా.. మరికొందరు వేరే రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ జాబితాలోకే వస్తుంది ప్రముఖ బాలనటి కీర్తన. ఈమె పలు సినిమాల్లో నటించి సత్తా చాటింది. ఇక ఇంతే లైఫ్ అనుకోకుండా పట్టువదలకుండా శ్రమించి ఏకంగా ఐఏఎస్‌కు ఎంపికై చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... HS కీర్తన ఒక పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించింది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. 'కర్పూరద గొంబే', 'గంగా-యమునా', 'ముద్దిన అలియా','ఉపేంద్ర','ఎ', 'కానూరు హెగ్గదాటి', 'సర్కిల్ ఇన్‌స్పెక్టర్', 'ఓ మల్లిగే', 'లేడీ కమీషనర్', 'హబ్బ', 'దొరే', 'సింహాద్రి', 'జనని','చిగురు', 'పుటాని ఏజెంట్','పుతని' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. వరస అవకాశాలతో బిజీగా గడిపినా ఆమెకు ఇండస్ట్రీలో సంతృప్తిగా అనిపించలేదు. ప్రజలకు సేవ చేయాలని బలంగా ఫిక్స్ అయింది.

ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలో ఫెయిలైంది. అయినా వెనక్కి తగ్గకుండా ఏకంగా ఐదుసార్లు పరీక్ష రాసి చివరగా ఆరో ప్రయత్నంలో సత్తా చాటింది. తన మొదటి పోస్టింగ్ కోసం కర్ణాటకలోని మాండ్యా జిల్లాను ఎంచుకుంది. ఈ క్రమంలో అనేక ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నప్పటికీ, సంకల్పం, కృషి ఉంటే తాము అనుకున్నది సాధించవచ్చని కీర్తన నిరూపించింది. ప్రస్తుతం ఆమెను అనేకమంది యువకులు, యువతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Advertisement

Next Story