బిగ్ బాస్ చివరి కంటెస్టెంట్‌గా స్టార్ నటుడు.. హౌస్‌మేట్స్‌పై నాగార్జున షాకింగ్ కామెంట్స్!

by Anjali |   ( Updated:2023-09-04 09:07:08.0  )
బిగ్ బాస్ చివరి కంటెస్టెంట్‌గా స్టార్ నటుడు.. హౌస్‌మేట్స్‌పై నాగార్జున షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రారంభం అయింది. సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా మొదలైంది. దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పరిచయం చేస్తూ హౌస్‌లోకి పంపించారు. హౌస్ లోకి ఈసారి 14 మందిని పంపించారు. చివరిగా 14వ కంటెస్టెంట్‌గా టీవీ సీరియల్ నటుడు ‘‘అమర్‌దీప్ చౌదరి’’ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో హోస్ట్‌ అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పారు. ‘‘ఎలాగైనా గెలిచి చూపిస్తా’’ అంటూ నాగార్జునతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. అనంతరం నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. హౌస్‌లోకి వెళ్లిన వారు హౌస్ మేట్స్ కాదు అని షాక్ ఇచ్చారు నాగార్జున. బిగ్ బాస్ సీజన్-7 గతంలో లా ఉండదని మరింత క్రేజీగా ఉంటుందని ముందు నుంచి నాగార్జున చెప్తూనే ఉన్నారు. దీంతో ఈసారి మరింత రసవత్తరంగా ఉందని తెలుస్తోంది.

Read More: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ వీళ్ళే ..!

Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున

Advertisement

Next Story