SSMB-29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై అదిరిపోయే అప్డేట్.. హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-03-19 13:07:23.0  )
SSMB-29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై అదిరిపోయే అప్డేట్.. హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందించగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ(KL Narayana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి కీరవాణి(Keeravani) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న పోస్ట్‌లో.. ‘ఒడిశా(Odisha) షెడ్యూల్ నేటితో ముగిసింది.. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఇన్‌డోర్ షూటింగ్ ఎక్కువగా చిత్రీకరించబడింది, ఈ వారం ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది’ అని ఉన్న ఓ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story