తన గతాన్ని పంచుకున్న శ్రీలీల.. ఇలాంటి అమ్మాయినా ట్రోల్స్ చేసేది అంటూ..

by sudharani |
తన గతాన్ని పంచుకున్న శ్రీలీల.. ఇలాంటి అమ్మాయినా ట్రోల్స్ చేసేది అంటూ..
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే మంచి స్టార్డమ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోల సరసన కూడా నటించి అలరించింది ఈ బ్యూటీ. తన నటనతో, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీలీల ఓ క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన సమత కుంభ్-2024 వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన డ్యాన్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గోదాదేవిగా ఆమె అభినయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తన క్లాసికల్ డ్యాన్స్ గురించి, గతాన్ని తలుచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది శ్రీలీల.

‘హేయ్ లవ్లీస్.. ఆ రోజు నేను గతంలోకి ప్రయాణించిన రోజు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేను క్లాసికల్ డ్యాన్సర్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. నిజానికి చాలా చిన్న వయస్సులోనే ఈ క్లాసికల్ డ్యాన్స్ ప్రారంభమైంది. మా టీంతో కలిసి ప్రదర్శనల కోసం ఎక్కువగా దేవాలయాలకు వెళ్లేదాన్ని. మేము వాటిని ‘బ్యాలెట్స్’ (బ్యాలెట్ డ్యాన్స్ కాదు) అని పిలిచాము. అప్పటి రోజులు నిజంగా నాకు చాలా విషయాలను నేర్పించాయి. ఆ క్షణాలను చాలా ఆనందించేదాన్ని. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం వైవిధ్యంగా అనిపించినా.. ఇప్పటికీ డ్యాన్స్ నాలో ఒక భాగమే అనిపిస్తోంది. నాలో మీరు చూస్తున్న మరొక కోణం ఇది. దాదాపు 10-15 ఏళ్లు తర్వాత నేను స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం’ అంటూ ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది శ్రీలీల. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. శ్రీలీలకు ప్రశంసలతో పాటు.. ‘ఇలాంటి అమ్మాయినా మనం అందరం ట్రోల్స్ చేస్తు్న్నది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరూ నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed