స్టార్ హీరోయిన్ బాటలో మెగా డాటర్ శ్రీజ.. ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయా అంటూ ట్రోల్స్

by sudharani |   ( Updated:2024-04-25 14:13:58.0  )
స్టార్ హీరోయిన్ బాటలో మెగా డాటర్ శ్రీజ.. ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయా అంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో నటించనప్పటికీ బయట ఫుల్ క్రేజ్ ఉంది ఈ బ్యూటీకి. ఇక ఒకానొక సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి సంచలనం సృష్టించింది. ఇక ఓ కూతురు జన్మించిన తర్వాత అతడితో మనస్పర్థలు కారణంగా విడిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుని ఆయనతో కూడా ఓ కూతుర్ని జన్మించింది. అయితే.. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌తో కూడా విడిపోయి తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలోనే తాను ఇండిపెండెంట్‌గా జీవించాలి చూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తను కొత్త బిజినెస్ట్‌లో అడుగుపెట్టినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ‘అనంత స్టూడియో’ పేరుతో ఓ ఫిట్‌నెస్ట్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పాశెట్టి హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీటికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో శ్రీజను కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నావా.. ఇక నైనా మా అన్నకు (చిరంజీవి) మంచి పేరు తీసుకురా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇలానే జిమ్‌, వర్కౌట్‌ సెంటర్లని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస బిజినెస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఈమె బాటలోనే మన మెగా డాటర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed