Swag Teaser : శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ విడుదల.. రీతువర్మ, మీరాజాస్మిన్ అదరగొట్టారుగా.!

by Prasanna |   ( Updated:2024-08-29 14:52:31.0  )
Swag Teaser : శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ విడుదల.. రీతువర్మ, మీరాజాస్మిన్ అదరగొట్టారుగా.!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య యంగ్ హీరోస్ లో హీరో శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి సత్తా చాటుతున్నాడు. గతంలో శ్రీవిష్ణుతో రాజ రాజ చోర మూవీ తీసి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్ లో ‘స్వాగ్’ అనే కొత్త మూవీ రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ మూవీ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, నేడు స్వాగ్ టీజర్ విడుదల చేసారు.

ఈ టీజర్ చూస్తుంటే ప్రస్తుతం, భవిష్యత్తులో రెండు వంశాల మధ్య జరిగే వార్ లాగా అనిపిస్తుంది. ప్రేక్షకులు మరొక సారి నవ్వడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. స్వాగ్ టీజర్ ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ మూవీలో రీతువర్మ, మీరాజాస్మిన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ మూవీలో శ్రీవిష్ణు ఒకటి కాదు.. నాలుగు రకాల పాత్రలతో అలరించబోతున్నారని తెలుస్తుంది. శ్రీవిష్ణుతో పాటు రీతువర్మ కూడా రాజుల కాలం నాటి పాత్రలు వేసినట్టు అర్ధమవుతుంది. దీంతో శ్రీవిష్ణు మరో కామెడీ మూవీతో మనల్ని నవ్వించడానికి రాబోతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed