'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌‌‌‌‌‌లో శ్రీలీల.. లుక్ అదిరింది...

by Sujitha Rachapalli |
సీతారామం దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌‌‌‌‌‌లో శ్రీలీల.. లుక్ అదిరింది...
X

దిశ, సినిమా : సినిమాలు లేక ఖాళీగా ఉన్న శ్రీలీల ప్రస్తుతం యాడ్స్ చేసుకునే పనిలో పడిపోయింది. తాజాగా ఓ విద్యా సంస్థలను ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసిన అమ్మడు.. ఇందుకు సంబంధించిన BTS పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెట్రో లుక్ గురించి స్పెషల్ అప్రిసియేషన్ చేస్తూ.. స్మాల్ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ యాడ్ డైరెక్షన్ హను రాఘవపూడి చేసినట్లు చెప్పుకొచ్చింది. ఆయనకు థాంక్స్ చెప్పింది. అడ్వర్టైజ్మెంట్ అయినా ఇలాంటి పాత్రలు చేయడంలో సంతృప్తి లభిస్తుందని తెలిపింది.

కాగా హను రాఘవపూడి డైరెక్షన్ లో చేసిన ఈ యాడ్ లో శ్రీలీల అందంగా కనిపించగా.. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సీతారామం' లాంటి ఒక హిట్ పడితే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు. ఈ డ్రెస్ లో క్యూట్ గా ఉందని పొగిడేస్తున్న ఫ్యాన్స్.. ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో తగ్గేదేలే అంటున్నారు. మై డార్లింగ్ అంటూ మురిసిపోతున్నారు ఇంకొందరు కుర్రాళ్లు.


Advertisement

Next Story

Most Viewed