‘లవ్ యూ’ అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టిన ఉపాసన..

by sudharani |
‘లవ్ యూ’ అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టిన ఉపాసన..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఎత్తపల్లాలను దాటుకుని మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. నిజ జీవితంలో కూడా సమాజంలో అవసరం అయినప్పుడు ఆయనకు చేతనైన సాయం అందిస్తూ వచ్చారు. దీంతో మెగాస్టార్‌కు అభిమానులు కోట్లల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు రావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన కూడా శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా మరో పోస్ట్ పెట్టింది ఉపాసన. ఈ మేరకు మెగా ఇంటి మనవరాలితో ఉన్న చిరంజీవి ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీరు చూసేది శక్తివంతమైన పిడికిలిని ఏర్పరుచుకునే ఐదు వేళ్లు. కేవలం సినిమా & దాతృత్వంలోనే కాకుండా జీవితంలో - నాన్నగా, మావయ్యగా & తాతగా మీ స్ఫూర్తికి పద్మవిభూషణ్‌తో సత్కరించారు. లవ్ యూ చిరంజీవి కొణిదెల’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed