క్షమించండి.. నేను దానికి దూరంగా ఉంటానంటూ అర్జున్ రెడ్డి బ్యూటీ పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-07-05 09:04:41.0  )
క్షమించండి.. నేను దానికి దూరంగా ఉంటానంటూ అర్జున్ రెడ్డి బ్యూటీ పోస్ట్..
X

దిశ, సినిమా: తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న వారిలో షాలిని పాండే ఒకరు. ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని క్రేజీ బ్యూటీ గా మారింది. కానీ టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇటీవల మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తాజాగా, షాలిని పాండే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించింది.

ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ నేను విష్ చేశాను మీరు చూడలేదు అని అడగ్గా.. క్షమించండి కొన్నిసార్లు చేస్తాను. కానీ సాధారణంగా ఫోన్‌కు దూరంగా ఉంటాను. ఎంతో ప్రేమిస్తున్నాను. నేను ఇంకా యాక్టివ్‌గా ఉండేందుకు ట్రై చేస్తాను’’ అని రాసుకొచ్చింది. అలాగే మరొ వ్యక్తి నేను బరువు తగ్గడానికి మీ బాడీ సైజ్ ఇన్‌స్పైర్ చేసింది అని కామెంట్ పెట్టగా.. ఏదైనా స్పూర్తి ఉంటే. మీరు మీ ఫిటెస్ట్ బెస్ట్‌గా ఉండాలి. దయచేసి ఆ దిశగా కృషి చేయండి. మీ శరీరం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలిని పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed