సిద్దిపేట జిల్లాలో Sonu Sood విగ్రహం!

by sudharani |   ( Updated:2023-01-21 13:59:14.0  )
సిద్దిపేట జిల్లాలో Sonu Sood విగ్రహం!
X

దిశ, సినిమా: క‌రోనా సమయంలో పేదలకు, వలస కూలీలకు చేయూత అందించాడు రియల్ హీరో సోనూసూద్. అయితే రీసెంట్‌గా సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం, దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమె తండాను బుధవారం సందర్శించాడు. ఇందులో భాగంగా చెలిమె తండాలో అభిమానులు నిర్మించిన తన ఆలయాన్ని, అందులోని తన విగ్రహాన్ని చూసి మురిసిపోయాడు.

అలాగే తనకు రాజకీయాలతో పని లేదని, ప్రజల అభిమానం ఉంటే సరిపోతుందని చెప్పాడు. అలాగే 'నన్ను దైవంలా చూడొద్దు. నేను మీలాగే మనిషిని. మీరు చూపిన అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా. చెలిమెతండా ప్రజలకు ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటా. త్వరలోనే స్థానికులతో సమావేశమై గ్రామాభివృద్ధి కార్యాచరణ మొదలుపెడతా' అని హామీఇచ్చాడు సోనూసూద్.

ఇవి కూడా చదవండి : 'ది చెల్లో షో' ఆస్కార్ నామినేషన్‌ ఎంపికపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

Advertisement

Next Story