- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివాజీతో కొడుకు బాండింగ్.. ఈ ప్రోమో చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు
దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. తొమ్మిదో వారంలో తేజ ఎలిమినేషన్ అయిపోవడంతో.. పదో వారం నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. అయితే అన్ని వారాల కంటే భిన్నంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. కాగా ఎన్నో గొడవలతో ఈ ఘట్టం కాస్త ముగియగా.. మొత్తానికి నామినేషన్స్ లో భోలే, గౌతమ్, శివాజీ, యావర్, రతికా ఉన్నారు. అయితే ప్రతి సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ప్లాన్ చేస్తారు బిగ్ బాస్. అది కూడా ఎప్పుడో 80వ ఎపిసోడ్‌లో ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఇంకా పది వారాలు కూడా కంప్లీట్ కాకుండానే ముందుగానే ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీ పెద్ద కొడుకు హౌస్ లోకి డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తన తండ్రికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ప్రోమో నిజంగా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. శివాజీ తన కొడుకుని పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంటి సభ్యులంతా కూడా అతన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక శివాజీ ఏడుస్తుంటే తమ కళ్లలో నీళ్లు తిరిగాయి అని.. దాదాపు పది సార్లు ప్రోమో చూసి ఉంటామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.