- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Files: అద్దంకి దయాకర్ ప్రధాన పాత్రలో సినిమా.. ‘ఇండియా ఫైల్స్’ నుంచి సాంగ్ రిలీజ్
దిశ, సినిమా: ప్రముఖ రాజకీయ నేత అద్దంకి దయాకర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'ఇండియా ఫైల్స్'. సితార, ఇంద్రజ, సుమన్, శుభలేఖ సుధాకర్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని జై ఇండియా అనే పాటకు మాత్రం సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ స్వరాలు సమాకూర్చారు. ఈ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ వేడుకకు హాజరైన అతిథులు పాటతో పాటు సినిమా కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ 'జై ఇండియా పాట ఔనత్యం తెలిపేందుకు ఈ వేడుక నిర్వహించాం. సినిమా అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టపడే చిత్రం ఇది. సినిమా విడుదల తరువాత మౌత్‌టాకే ఈ చిత్రానికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మన దేశ సనాతన, ఇతిహాస ధర్మాలలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎటువంటి మార్పులు చేయకుండా తీసుకోని ఈ కథ తయారు చేసారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఖచ్చితంగా దేశం మొత్తం చర్చ జరిగేలా చేస్తది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను ఖాళీగా ఉంచితే సమాజానికి పనికొచ్చే ఇలాంటి మంచి సినిమాలు చేస్తాను' అన్నారు. దర్శక నిర్మాత బొమ్మకు మురళి మాట్లాడుతూ 'ఈ సినిమాలో మనిషి మనుగడ గురించి, మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు మన జీవన విధానంలో జరిగిన మార్పులు, సనాతన ధర్మం మన మధ్య ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది అనేది కథ గా చెప్పా. కల్చరల్ డి ఎన్ ఏ అనే కాన్సెప్ట్ తో, చట్టాలు మనల్ని కంట్రోల్ లో పెట్టేలా ఎలా వచ్చాయి అని ఈ సినిమా కథ. ఈ సినిమాలో హీరోగా నటించిన అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన నా సినిమా కథకు హీరోగా కరెక్ట్‌గా సరిపోయాడు' అన్నారు.