35% మాత్రమే బతికే ఛాన్స్.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్

by Sujitha Rachapalli |
35% మాత్రమే బతికే ఛాన్స్.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం లాంటి సినిమాల్లో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఆమె.. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. అనంతరం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే కొద్ది రోజులు ఫ్యామిలీతో ఆనందంగా గడిపిన ఆమెకు.. క్యాన్సర్ ఉందనే విషయం తెలిసి చాలా బాధపడిపోయింది.

ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్లింది. కానీ సర్వైవల్ రేట్ 35% మాత్రమే అని చెప్పారట డాక్టర్స్. అయినా సరే 100 శాతం పోరాడిన ఆమె.. మొత్తానికి బతికి చూపించింది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అటు షోస్ జడ్జిగా ఇటు ఓటిటి ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపేస్తుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సోనాలి.

Advertisement

Next Story

Most Viewed