ఈ అందం ఎవరి సొంతం కాదంటున్న Sonal Chauhan.. అసలే వదిలిపెట్టమంటున్న కుర్రాళ్లు

by sudharani |   ( Updated:2023-09-15 15:48:25.0  )
ఈ అందం ఎవరి సొంతం కాదంటున్న Sonal Chauhan.. అసలే వదిలిపెట్టమంటున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సోనాల్‌ చౌహాన్ మాల్దీవుల్లో రచ్చ చేస్తుంది. గత వారం ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడకు వెళ్లినట్లు చెప్పిన నటి ఎప్పటికప్పుడూ తాను ఆస్వాదిస్తున్న ప్రకృతి అందాలతోపాటు తన గ్లామర్‌ను కూడా చూపిస్తూ అభిమానులను అలరిస్తోంది. భూతల స్వర్గాన్ని తలపించే ఆ అందమైన పర్యాటక ప్రదేశంలో సందడి చేస్తు్న్న అందాల భామ రిసార్ట్స్‌, సముద్ర తీరాల్లో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తుంది. ఈ మేరకు బ్లాక్ స్విమ్‌ వేర్‌లో గ్రీన్ టోపీ పెట్టుకొని హొయలు పోయిన హాటీ.. అందాలు ఆరబోస్తున్న స్టిల్స్‌ నెట్టింట షేర్ చేసి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది. అంతేకాదు ‘ఆమె అరుదైన ఆత్మ. ఆమె అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. అది మిమ్మల్ని ఆమె పక్కన పరుగెత్తేలా చేస్తుంది. ఆమె తనకు తప్ప మరెవరికీ చెందినది కాదు’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ‘నిన్ను ఎప్పటికీ వదలం. నీ అందాన్ని పొందేవరకూ ప్రయత్నిస్తాం’ అంటూ బాయ్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఆ నీచమైన కామెంట్స్ చూస్తే కన్నీళ్లు ఆగలేదు.. ప్రతి పార్ట్‌ను ఎగతాళి చేశారు

Advertisement

Next Story