నిర్మాత దిల్‌రాజ్ అల్లుడు కారు చోరీ.. పోలీసులకు షాకిచ్చిన దొంగ ఏం చెప్పాడంటే?

by Hamsa |   ( Updated:2023-10-14 05:27:06.0  )
నిర్మాత దిల్‌రాజ్ అల్లుడు కారు చోరీ.. పోలీసులకు షాకిచ్చిన దొంగ ఏం చెప్పాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన కారు చోరీ అయింది. దాదాపు రూ.1.7 కోట్ల విలువైన పోర్షే కారును ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో అర్చిత్ రెడ్డి జూబ్లిహిల్స్ దనపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు. ఆ తర్వాత వచ్చాక తన కారు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అతను మన్సురాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన సమాధానం చూసి అంతా షాక్ అయ్యారు. తాను అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారును తీసుకెళ్లాలని సూచించడంతో దీనిని తీసుకెళ్తున్నట్లు చెప్పి పోలీసులను టెన్షన్ పెట్టాడు. అంతేకాకుండా తాను హృతిక్ రోషన్‌తో కలిసి కారులో అత్యవసరంగా అకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నానని తనను వదిలి పెట్టమని చెప్పాడు. ఇక పోలీసులకు ఏం చేయాలో తెలియక అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. దానికి వారు అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని చికిత్స తీసుకుంటున్నాడని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed