ప్లాస్టిక్ సర్జరీల కారణంగానే నెట్టుకొస్తున్న నయన్.. నెట్టింట ట్రోల్స్.. ప్రూఫ్ కూడా చూపించేశారు..

by sudharani |   ( Updated:2023-09-30 13:41:26.0  )
ప్లాస్టిక్ సర్జరీల కారణంగానే నెట్టుకొస్తున్న నయన్.. నెట్టింట ట్రోల్స్.. ప్రూఫ్ కూడా చూపించేశారు..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ నయనతార ఒక్కో మెట్టు ఎదుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారింది. ఈ మధ్య వచ్చిన ‘జవాన్’తో ఏకంగా ఇంటర్నేషనల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక రీసెంట్‌గా ‘9SKIN’తో బిజినెస్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టిన నయన్.. హీరోయిన్ కాక ముందు మలయాళం టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేసేది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. అభిమానులు ఆమె ఎదిగిన తీరును పొగిడేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు అంత పర్ఫెక్ట్‌గా మలయాళం మాట్లాడిన భామ.. ఇప్పుడు మాత్రం ఆ భాష రాని వారు మాట్లాడినట్లుగా యాక్ట్ చేస్తుందని తిట్టిపోస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకపోతే కచ్చితంగా ఇంత స్టార్‌డమ్ రాకపోయి ఉండేదని ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story