నాగచైతన్య, సమంతలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శోభిత.. వైరల్ అవుతున్న కామెంట్స్ !

by Jakkula Samataha |
నాగచైతన్య, సమంతలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శోభిత.. వైరల్ అవుతున్న కామెంట్స్ !
X

దిశ, సినిమా : నాగచైతన్య తన అభిమానులందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌నే నిజం చేస్తూ.. శోభితను త జీవితంలోకి ఆహ్వానిస్తూ..తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని, సమతను తన లైఫ్‌లో నుంచి పూర్తిగా తొలిగించేశాడు.

అయితే ఏమాయ చేశావే సినిమాతో ఒకటైన ఈ జంట ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు చాలా ఆనందంగా సాగిన వీరి వైవాహిక జీవితం అక్టోబర్ 2021లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని, సింగిల్‌గా ఉంటున్నారు. కానీ చైతూ ఊహించని విధంగా శోభితతో రెండో పెళ్లికి రెడీ అయ్యి అందరికీ షాకిచ్చాడు. ఈ నేపథ్యంలో శోభిత గతంలో సమంత, నాగచైతన్య గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, శోభితను మంచి పేరు తెచ్చుకున్న సౌత్ స్టార్స్ గురించి అడగ్గా, ఆమె సమత గురించి చెప్తూ..సమంత ఎంచుకునే పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆమె ఫిల్మోగ్రఫీ, కెరీర్ అమేజింగ్, చిత్ర పరిశ్రమలో సామ్ ఓ గొప్ప అధ్యాయానికి తెర తీసిందని చెప్పుకొచ్చింది. అలాగే నాగచైతన్య గురించి చెప్పుకొస్తూ.. అతను చాలా కామ్ గోయింగ్ పర్సన్. ప్రతీది చాలా కూల్‌గా డీల్ చేస్తాడు. ఆచీతూచీ ముందుకు వెళ్తాడు, జీవితం పట్ల అతని అప్రోచ్ నాకు ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story