లంబకోణాలు నేర్పినవాళ్లే కుంభకోణాలు చేస్తున్నారు: ఆర్. నారాయణ మూర్తి

by Aamani |   ( Updated:2023-04-24 11:52:01.0  )
లంబకోణాలు నేర్పినవాళ్లే కుంభకోణాలు చేస్తున్నారు: ఆర్. నారాయణ మూర్తి
X

దిశ, సినిమా: ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నూతన తారాగణంతో తెరకెక్కించిన చిత్రం ‘యూనివర్సిటీ’. త్వరలో విడుదల కాబోతున్న సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ మీడియాతో ముచ్చటించారు నారాయణ మూర్తి. ‘స్నేహ చిత్ర పిక్చర్స్ ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్ పూర్తి అయింది. అతి త్వరలో ఆడియో, ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తాం. 10వ తరగతి, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరిగితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్లే కుంభకోణాలు చేస్తుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే.. ఈ విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమిది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read..

ఆ వయసులోనే ఆమెను ఇష్టపడ్డాను: JR.NTR

Advertisement

Next Story