- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో స్మృతి ఇరానీ.. భయంగానే నటించిందట!
దిశ, సినిమా: శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో నటించడంపై నటి, ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టెలివిజన్ హిట్ షో ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’తో గుర్తింపు పొందటానికి ముందు ఓ శానిటరీ బ్రాండ్ కోసం నటించిన వీడియోను షేర్ చేసింది. ‘నిజానికి ఒక గ్లామర్ ఆధారిత మోడల్‌కు కెరీర్‌ను కిల్ చేసే ఇలాంటి నిర్ణయం సవాలుతో కూడినదే. ఎందుకంటే ఆ రోజుల్లో ప్యాడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం నిషిద్ధం. దీంతో ఒక పెద్ద కంపెనీ ప్రకటనను చేయడానికి చాలామంది విముఖత చూపారు. కానీ, కెమెరా ముందు నా పనిని ప్రారంభించాలనే ఆత్రుతతో నేను ఓకే చెప్పాను. 25ఏళ్ల క్రితం నేను చేసిన పని గురించి జనాలు చాలా గుసగుసలాడారు. అయితే అవకాశం తర్వాత నేను వెనుకకు చూడలేదు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు’ అంటూ రాసుకొచ్చింది మహిళా & శిశు అభివృద్ధి అండ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి.