హైదరాబాద్‌లో ఇస్మార్ట్ బ్యూటీ సందడి.. ఫోటోలు వైరల్

by Jakkula Samataha |
హైదరాబాద్‌లో ఇస్మార్ట్ బ్యూటీ సందడి.. ఫోటోలు వైరల్
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ, కన్నడ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ద్వారా ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ పూరీ జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ ద్వారా ఈ ముద్దుగుమ్మ హిట్ తన ఖాతాలో వేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయినా ఈ అమ్మడుకు మాత్రం టాలీవుడ్‌లో ఆశించిన రేంజ్‌లో అవకాశాలు రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును మాయచేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో సందచి చేసింది. ట్యాంక్ బండ్, చార్మినార్, ప్రసాద్ ఐమాక్స్ వద్ద తాను ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైట్ టీషర్ట్, జీన్స్ ధరించి, చాలా సింపుల్‌గా ఉన్న ఈ బ్యూటీ పిక్స్ చూసి నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు‌.ఇక ప్రస్తుతం నభా నటేష్ డార్లింగ్ సినిమా, అఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story