Skanda Trailer: ‘స్కంద’ ట్రైల‌ర్ రిలీజ్..ఊర‌మాస్‌ లుక్‌లోరామ్ పోతినేని

by Prasanna |   ( Updated:2023-08-29 05:50:25.0  )
Skanda Trailer: ‘స్కంద’ ట్రైల‌ర్ రిలీజ్..ఊర‌మాస్‌ లుక్‌లోరామ్ పోతినేని
X

దిశ, సినిమా: రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కంద’. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్యమిస్తూ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా శ్రీకాంత్‌, ప్రిన్స్‌, గౌత‌మి ప్రధాన పాత్రల‌ను పోషిస్తున్నారు. వినాయ‌క‌చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలచేశారు మేకర్స్. హైద‌రాబాదీ స్లాంగ్‌లో హీరో రామ్ చెప్పిన డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇయ్యాలే, కొయ్యేలా, గ‌ట్టిగా అరుస్తే తొయ్యేలే.. అడ్డమొస్తే లేపాలే’ అనే డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ మొదలవగా ఓవరల్‌గా ఒక్కో యాక్షన్ సీన్ మాత్రం కుమ్మేశారు. మూడు డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో రామ్ కనిపిస్తున్నాడు. మరి ట్రైలర్‌లోనే ఫైట్ ఎఫెక్ట్‌లు ఈ రేంజ్‌లో ఉంటే ఇంకా మూవీ మొత్తం ఎలా ఉంటాయో చూడాలి.

Advertisement

Next Story