మాస్ డ్యాన్స్‌లో మరోసారి రెచ్చిపోయిన మహేష్ బాబు కూతురు.. చిరిగిన డ్రెస్‌లో ఇరగదీసిందిగా!

by Jakkula Samataha |
మాస్ డ్యాన్స్‌లో మరోసారి రెచ్చిపోయిన మహేష్ బాబు కూతురు.. చిరిగిన డ్రెస్‌లో ఇరగదీసిందిగా!
X

దిశ, సినిమా : ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ కిడ్స్‌లో సితారా ఒకరు. ఈ క్యూట్ బేబీ తన డ్యాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అయితే సితారకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో సితార తన డ్యాన్స్ ఫర్ఫామెన్స్‌తో ఇరగదీసింది. బ్లాక్ కలర్ ట్రెండీ టాప్, జీన్స్ ధరించిన ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. తన డ్యాన్స్ మాస్టర్ ఫల్గుణితో కలిసి ఆమె ఓ హాలీవుడ్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. దీంతో వారి డ్యాన్స్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్స్‌ను మించి సితార డ్యాన్స్ చేస్తుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇక సితార జ్యూవెల్లరీ గోల్డ్ యాడ్‌తో చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనలో తన అందానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో సితారను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుండు అని కూడా కోరారు. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార సినిమాల్లోకి ఎంట్రీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.. త్వరలోనే నేను ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సితార ఎంట్రీపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed