- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sir Movie: సార్ సినిమా కొత్త ట్రెండును సెట్ చేసింది.. అదేంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : హీరో ధనుష్‌కు తెలుగులో ఎంత మార్కెట్ ఉందో ఈ సినిమా ద్వారా తెలిసింది. నిన్నటి వరకు ఏ మాత్రం పట్టించుకోని తెలుగు ఆడియన్స్ సార్ సినిమా ప్రీమియర్స్ కి పరిగెత్తారు. ఎన్నో అంచనాల మధ్య సార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనం ఊహించినట్టు గానే సినిమా పాజిటివ్ టాక్ తో షో రన్ అవుతుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ తెలుగులో క్రేజ్ వున్న హీరోలకి వచ్చినట్టుగా రావడం ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధనుష్‌కు తెలుగులో ఈ మాత్రం మార్కెట్ లేదు. ఈయన చేసిన సినిమాల్లో రఘువరన్ B.Tech మాత్రమే కాస్త మెరుగైన రిజల్ట్‌ను కనిపించింది.
మార్నింగ్ షో కి ఇంతలా రావాటం, అందులోనూ శివరాత్రి పండగ రోజు ఈ స్థాయి కలెక్షన్ వసూలు చేయటం చెప్పుకోవాల్సిన విషయమే. తెలుగులో మంచి మార్కెట్ వున్న సూర్య, కార్తికి కుడా ఇప్పటి వరకూ ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఒక్కరోజు ముందుగా అనగా గురువారం చైన్నై,హైద్రాబాద్‌లలో ప్రీమియర్స్ షోస్ పడ్డాయి . హైద్రాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ సార్ సినిమా 3 ప్రీమియర్ షోలు వేశారు. అయితే ప్రీమియర్ ప్రకటించిన కొన్ని గంటలకె అన్నీ షోల టిక్కెట్లు అయిపోవటం ఓ రికార్డు. అలాగే అన్ని షో లు హౌస్ ఫుల్ అవటం మరో విశేషం. ప్రీమియర్ షో లు హౌస్ ఫుల్ అవటంతో సినిమా విజయం పై చిత్ర యూనిట్ అంతా సంతోషాన్ని వ్యక్తం చేసారు.