లైవ్ షోలో పాట పాడుతుండగా సింగర్‌కు బుల్లెట్ గాయం..

by Hamsa |   ( Updated:2023-06-02 03:57:41.0  )
లైవ్ షోలో పాట పాడుతుండగా సింగర్‌కు బుల్లెట్ గాయం..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ గాయం అయింది. బీహార్‌లోని పాట్నాలో ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో పాట పాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. లైవ్ షోలో బుల్లెట్ తగలడంతో నిషాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: పెళ్లి ఫొటోతో దర్శనమిచ్చిన దసరా సినిమా డైరెక్టర్

Advertisement

Next Story