ఈ బాధ ఎవరితో చెప్పుకోను.. నెలన్నరగా తిరుగుతూనే ఉన్నా.. సింగర్ ఎమోషనల్ పోస్ట్

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-09 09:25:50.0  )
ఈ బాధ ఎవరితో చెప్పుకోను.. నెలన్నరగా తిరుగుతూనే ఉన్నా.. సింగర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా : సింగర్ కమ్ యాక్ట్రెస్ దెబత్తమ సాహ గొంతు నొప్పి నుంచి కోలుకోలేకపోతున్నానని బాధపడుతుంది. ఇప్పటికే నలుగురు డాక్టర్లను కలిసినా.. ఫలితం లేకుండా పోయిందని చెప్తుంది. కూనిరాగాలు మాత్రమే తీయగలుగుతున్నానని.. హైపిచ్‌లో పడే రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నానని, త్వరగా రికవరీ అయ్యేలా చూడమని దేవుడిని కోరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

సంతోషమైనా, బాధైనా పాట రూపంలో వ్యక్తపరుచుకునే తాను.. ఇలా అయిపోవడంతో విపరీతమైన కోపం వస్తుందని చెప్తుంది దెబత్తమ. కానీ ఒక్కోసారి ఫన్నీగా అనిపిస్తుందని.. తన మీద తానే జోకులు కూడా వేసుకుంటున్నానని తెలిపింది. బాధ వర్ణణాతీమేనని.. గొంతు ఎక్కువగా వాడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటుంది బ్యూటీ.

Advertisement

Next Story

Most Viewed