- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కియారాతో సిద్ధార్థ్ పెళ్లి.. ఆహ్వానం అందలేదన్న హీరో
దిశ, సినిమా:యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి సహనటి కియారా అద్వానీతో పెళ్లి వార్తలపై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఇటీవల కాలంలో సిద్ధార్థ్- కియారా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుంది, త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వివాహానికి రాబోయే అతిథుల లిస్ట్‌తోపాటు వేదిక కూడా రెడీ అయిందని, త్వరలోనే అధికారికంగా డేట్ అనౌన్స్ చేయబోతున్నారంటూ నానా హంగామా నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ పుకార్లను ప్రస్తావిస్తూ.. 'నా పెళ్లికి సంబంధించిన ఆహ్వానం ఇంకా అందలేదు. ప్రజలు కూడా వెళ్దామని పిలవలేదు. ఇప్పటికే రెండుసార్లు తేదీ వివరాలు చదివి నన్ను నేను చెక్ చేసుకున్నా. నిజంగా నేను ఈ తారీఖున పెళ్లి చేసుకుంటానా? అని అశ్చర్యపోయా' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రజలు ఇలాంటి ఊహాగానాలు చేస్తూ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే బదులు సినిమాలై ఫోకస్ చేస్తే బాగుంటుందని కోరాడు.