Siddhu Jonnalagadda: మాస్ మహారాజ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ

by Prasanna |   ( Updated:2024-08-15 15:46:04.0  )
Siddhu Jonnalagadda: మాస్ మహారాజ సినిమాలో  హీరో సిద్ధు జొన్నలగడ్డ
X

దిశ,సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య కొత్త మూవీస్ లో సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చాలా మంది అతిథి పాత్రల్లో కనిపించి సినిమాని హిట్ అయ్యేలా చేసారు. తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీలో యంగ్ హీరో గెస్ట్ పాత్రలో నటించి అందర్ని మెప్పించాడు.

హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. కానీ ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే, ఏ మూవీలో డీజే టిల్లు తో ఒక్క నైట్ లో పాపులర్ అయినా హీరో సిద్ధు జొన్నలగడ్డ సెకండ్ హాఫ్ లో గెస్ట్ అప్పీరెన్స్ తన డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.

హరీష్ శంకర్ పెద్ద తప్పు చేసావ్ .. అసలు ఈ సినిమా వీరిద్దర్ని కలిపి తీస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది. అలాగే సిద్ధుకి – రవితేజకి కలిపి ఎక్కువ సీన్స్ పెట్టి ఉండి ఉంటే చాలా బాగుండేడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story