- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి కెమెరా కంటికి చిక్కిన సిద్ధార్థ్ - అదితి
దిశ, వెబ్‌డెస్క్: ‘‘మహా సముద్రం’’ సినిమాతో పరిచయమైన అదితి రావు హైదరి, సిద్దార్థ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ అయిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆమె కోసం ముంబయి కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి డిన్నర్ పార్టీలు, లంచ్ పార్టీలు, సినిమాలు, షికార్లు ఇలా తెగ తిరిగేస్తున్నారు. అంతే కాదు శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా జంటగా వెళ్లారు. ఇటీవలే ఓ ఫేమస్ సాంగ్‌కు రీల్ కూడా చేసి నెట్టింట వైరల్ అయ్యారు. అయితే తాజాగా.. అదితి నటించిన ‘‘జూబిలీ’’ సిరీస్ ఈరోజు(ఏప్రిల్ 7) నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలో గురువారం ముంబైలో జూబిలీ సిరీస్ ప్రీమియర్ వేశారు. దీనికి బ్లాక్ లాంగ్ ఫ్రాక్‌లో అదితి, వైట్ షర్ట్‌లో సిద్దార్థ్ చుడముచ్చటైన జంటగా హాజరవ్వడంతో నెటిజన్లు మళ్లీ సందేహిస్తున్నారు. అలాగే మీడియాకు ఇద్దరూ కలిసి ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఈ సిరీస్‌కి సిద్దార్థ్‌కి ఎటువంటి సంబంధం లేకున్నా ఈ హీరోయిన్ కోసం వచ్చాడనుకుంటే, అతిథిలా చూసి వెంటనే వెళ్ళిపోవచ్చు కదా.. ఇలా ఇద్దరూ కలిస రావడమే కాకుండా మీడియాకి ఫోజులు ఇవ్వడం ఏంటని అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో వీరిద్దరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.