అలాంటి వారి పక్కన ఉండటం డేంజర్ అంటూ శృతి హాసన్ పోస్ట్.. బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడా?

by Hamsa |   ( Updated:2023-10-21 05:49:27.0  )
అలాంటి వారి పక్కన ఉండటం డేంజర్ అంటూ శృతి హాసన్ పోస్ట్.. బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ అమ్మడు శాంతన్ హజారికాతో ప్రేమలో ఉంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, శృతి హాసన్ తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘క్రియేటివ్ పీపుల్స్ ఎదుర్కొనే భయంకరమైన సమస్య ఏంటంటే.. క్రియేటివిటీ, ఒరిజినల్‌గా లేని వ్యక్తులతో ఉండటమే.. మీకు ఎప్పటికీ తెలియదు.. మీ ఆలోచన వారి అద్భుతమైన ఆలోచనగా ఎప్పుడు మారుతుందో’’ అని ఉన్న కొటేషన్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఈ భామ ఎవరి చేతిలోనైనా మోస పోయిందా.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ అమ్మడుని ఆమె బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు అందుకే ఈ పోస్ట్ పెట్టిందని అనుమానపడుతున్నారు.


Read More: హాస్పిటల్ బెడ్‌పై అలాంటి పొజీషన్‌లో టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story