వామ్మో అంతమందితో ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్.. డేటింగ్ లిస్ట్ వైరల్!

by sudharani |   ( Updated:2024-04-29 14:33:58.0  )
వామ్మో అంతమందితో ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్.. డేటింగ్ లిస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి శృతి హాసన్.. మల్టీ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. శృతి హాసన్ టూండూల్ ఆర్టిస్ట్‌ శంతను హజారికాతో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వీళ్లిద్దరూ విడిపోయినట్లు కూడా సమాచారం.

ఎందుకంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న శృతి.. తన బాయ్ ఫ్రెండ్ శంతతో ఉన్న ప్రతి ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అయితే.. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోలు అన్నింటిని కూడా ఆమె డిలీట్ చేసింది. దీంతో వీరు నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఈ క్రమంలోనే శృతి హాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె ఏకంగా ఇప్పటి వరకు దాదాపు 6 మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం సాగించిందని నెట్టింట ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. వారు ఎవరంటే..

మొట్ట మొదటిగా శృతి స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ‘3’ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ డేటింగ్ కూడా చేసినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇక నాగచైతన్యతో కూడా శృతీహాసన్ డేటింగ్ చేసిందన్న రూమర్ వచ్చింది. వీరిద్దరు కూడా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా, శృతి డేటింట్ చేసినట్లు వార్తల వచ్చాయి. దీనిపై ఒకానొక సందర్భంలో స్పందించిన సురేష్ రైనా మేము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, లండన్‌కు చెందిన మ్యూజిక్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలే కూడా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక శృతీతో కలిసి మైఖేల్ కోర్సలే ఇండియాకు కూడా రావడంతో వీరి డేటింగ్ వార్తలు మరింత బలపడ్డాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని కూడా చాలా మంది అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఫైనల్‌గా శృతి హాసన్ 2019లో శంతతో రిలేషన్‌లో ఉన్నట్లు మాత్రం అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను సైతం నెట్టింట పోస్ట్ చేసింది. ఇప్పుడు వీరు కూడా బ్రేకప్ చెప్పుకోవడంతో.. నెట్టింట శృతి హాసన్ ఊపందుకున్నాయి.

Read More...

ఫ్యాన్స్‌తో చిట్ చాట్.. అలాంటి పాత్రలే చేస్తా.. ఏమన్న ప్రాబ్లమా అంటున్న బోల్డ్ బ్యూటీ

Advertisement

Next Story