ఆ విషయంలోనే గొడవలు.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

by samatah |   ( Updated:2023-05-13 06:42:51.0  )
ఆ విషయంలోనే గొడవలు.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
X

దిశ,వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తన నటన, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అంతే కాకుండా టాలీవుడ్‌లోని స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇటీవల శ్రియ తన భర్తతో విడిపోతుంది. త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ ఈ రూమర్స్‌పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్తకి నాకు విడాకుల ఇవ్వబోతున్నాడంటూ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టడానికి కారణం నేను గతంలో గమనం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడమే. ఆ టైంలో చాలా మంది నా భర్తకు గురించి ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో నేను మూవీ ప్రమోషన్స్ గురించి ఇంటర్వ్యూలో పాల్గొంటే నా భర్త గురించి ప్రశ్నలేంటి అని అడిగాను. ఇక అప్పటి నుంచి శ్రియ భర్తతో గొడవలు పెట్టుకుందని,వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

Also Read...

ఫస్ట్ డేట్‌లోనే శృంగారం.. ఓరల్ సెక్స్‌ కూడా ఓకే.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story