శ్రద్ధా శ్రీనాథ్‌ బర్త్‌ డే.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ‘సైంధవ్‌’ టీమ్

by Prasanna |   ( Updated:2023-10-03 12:34:43.0  )
శ్రద్ధా శ్రీనాథ్‌ బర్త్‌ డే.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ‘సైంధవ్‌’ టీమ్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సైంధవ్‌’ మూవీ టీమ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. వెంకటేశ్ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తు్న్న మూవీలో మెయిన్ హీరోయిన్‌గా శ్రద్ధా కనిపించనుండగా రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే మూవీనుంచి విడుదలైన శ్రద్ధా లుక్‌ అమితంగా ఆకట్టుకోగా.. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా తన క్యారెక్టర్‌‌ పేరు మనోజ్ఞ అకాను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్‌ షేర్ చేశారు మేకర్స్. ‘టీమ్ #SAINDHAV వారి మనోజ్ఞ అకాకు శుభాకాంక్షలు @శ్రద్ధాశ్రీనాథ్‌కు హ్యాపీ బర్త్‌డే. ఆమె ప్రెజెన్స్ అండ్ అప్పియరెన్స్ రెండూ మిమ్మల్ని స్క్రీన్‌లకు కట్టిపడేస్తాయి’ అంటూ ప్రశంసలు కురిపించింది శైలేష్‌ అండ్ మేకర్స్‌ టీం. ఇక చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా నేపథ్యంలో సినిమా స్టోరీ రూపొందుతుండగా 2023 డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది.

Advertisement

Next Story