పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దా దాస్.. టాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నానంటూ కామెంట్స్

by Disha Web Desk 6 |
పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దా దాస్.. టాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నానంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ శ్రద్దా దాస్ సిద్దు ఫ్రమ్ సికాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్‌తో డార్లింగ్, అల్లు అర్జున్ ఆర్య-2, గోపీచంద్ మెగుడు వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. అయితే గత కొద్ది కాలంగా శ్రద్దా దాస్ సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రీఎంట్రీ ఇచ్చి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారిపోయింది. శ్రద్దా దాస్ ఇటీవల ‘పారిజాత పర్వం’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ వ్యక్తిగత విషయాలు తెలిపి అందరినీ ఆశ్యర్చానికి గురి చేసింది. ‘‘ గత కొద్ది కాలంగా నేను పెళ్లి చేసుకున్నానంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు ఇంకా మాకు పెళ్లి కాలేదు. అవును నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. నేను ప్రేమలో ఉన్నాను. అతను తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటుడు. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ అతను ఎవరు అనేది నేను బయటకు చెప్పాలనుకోవట్లేను. తొందరలో పెళ్లి కూడా చేసుకుంటాము.

ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. లవ్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ నేను అంగీకరించలేదు. అయితే నేను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ వాడుతున్నాను. ఆ అకౌంట్ ఏది అనేది చెప్పను. నాకు టాటూస్ అంటే అస్సలు నచ్చదు’’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ తాను ఎవరిని ప్రేమిస్తుందో అతని పేరు రివీల్ చేయలేదు. ప్రస్తుతం శ్రద్దా దాస్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. అతనెవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్ట్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed