వాళ్లకు బెండకాయతో ముప్పు.. తినకుండా ఉంటే మంచిది?

by Prasanna |   ( Updated:2023-07-31 06:14:55.0  )
వాళ్లకు బెండకాయతో ముప్పు.. తినకుండా ఉంటే మంచిది?
X

దిశ, వెబ్ డెస్క్: బెండకాయ తింటే.. లెక్కలు బాగా వస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే మనం బెండకాయలను వారంలో రెండు సార్లు తీసుకుంటాము. అంతే కాకుండా చాలా మందికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ మంచి ఆహారం. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వైద్యులు కూడా ఆహారంలో బెండకాయ చేర్చుకోవాలని సూచిస్తారు. కానీ దీన్ని మితి మీరి తింటే శరీరంలో అనేక సమస్యలు వస్తాయట. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బెండకాయకు దూరంగా ఉండాలట.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు బెండకాయ ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు ఉన్న వారు వీటిని ఎక్కువగా తింటే మరింత తీవ్రమవుతుంది. కాబట్టి బెండకాయలకు దూరంగా ఉండటమే మంచిది.

సైనస్

సైనస్ సమస్యతో బాధ పడే వారు బెండకాయను తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ పెరగవచ్చు

బెండకాయ ఉడుకుతున్నప్పుడు, జిగటను తొలగించి నూనె వేసి వేయించాలి. అలా వేయించేటప్పుడు నూనె ఎక్కువగా వాడితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి నూనెను తక్కువగా వేసి వండుకోవాలి.

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

Also Read: మేక పాలు తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed