Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు'కు రూ. 7 కోట్లతో భారీ విలేజ్ సెట్

by Nagaya |   ( Updated:2022-06-08 09:52:49.0  )
Ravi Teja begins shoot for Tiger Nageswara Rao on a massive set worth Rs 7 crore
X

దిశ, సినిమా : Ravi Teja begins shoot for Tiger Nageswara Rao on a massive set worth Rs 7 crore| మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇది రవితేజకు 71వ చిత్రం కాగా.. ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ మూవీలో తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా అప్‌డేట్ ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. షూటింగ్‌లో భాగంగా చిత్ర బృందం దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ. 7 కోట్ల వ్యయంతో భారీ విలేజ్ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. రవితేజ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి కాగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నటిస్తున్న 'రావణాసుర' చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించనున్నాడు రవితేజ.


Advertisement

Next Story

Most Viewed