Shivatmika Rajasekhar : మోడ్రన్ లుక్‌లో స్టార్ హీరో కూతురు.. నెటిజన్లు ఫిదా!

by Javid Pasha |
Shivatmika Rajasekhar : మోడ్రన్ లుక్‌లో స్టార్ హీరో కూతురు.. నెటిజన్లు ఫిదా!
X

దిశ, సినిమా : సినీ ఫీల్డ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే.. ఇక్కడ ప్రేక్షకులు, అభిమానులు నటీ నటుల యాక్టింగ్ గురించి మాత్రమే కాదు, వారికి సంబంధించిన అన్ని విషయాలపై ఫోకస్ పెడుతుంటారు. ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఏ కారులో తిరుగుతున్నారు. ఇలా ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు క్యూరియాసిటీ ప్రదర్శిస్తుంటారు. ప్రజెంట్ ఆ కోవకు చెందిన న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఓ స్టార్ హీరో కూతురు ‘మోడ్రన్ లుక్స్’ వైరల్ అవుతుండగా.. అభిమానులు, నెటిజన్లు స్పైసీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు, ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక. 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ మధ్య క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండలో చేసింది కానీ, ఈ మూవీ కూడా ఆమెకు కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో మంచి చాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా మస్తు ప్రయత్నాలు చేస్తోందని టాక్.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివాత్మిక ఈ మధ్య కాస్త ‘బోల్డ్ అండ్ మోడ్రన్ లుక్స్’ ఫొటోషూట్‌లు చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, చురకత్తుల్లాంటి చూపులతో ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోమ్లీ లుక్కే అనుకున్నాం కానీ.. మోడ్రన్ లుక్‌లోనూ మతిపోగొడుతున్నావంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.


Read more...

‘అతడు నాతో అసభ్యకరంగా బిహేబ్ చేశాడు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed