నేను ఎవరితో లేచిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో కూతురు

by Hamsa |   ( Updated:2022-11-24 07:22:01.0  )
నేను ఎవరితో లేచిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో కూతురు
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ కిడ్ శివాని రాజశేఖర్ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్యూటీ.. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన లైఫ్, కెరీర్, మ్యారేజ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఇటీవల అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అమ్మానాన్నలు కూడా ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉన్నాం. కానీ, జనాలు మాత్రం నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు కూడా రూమర్ క్రియేట్ చేశారు. నా ఒక్కదాని గురించే కాదు మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ ఏవో పుకార్లు చేయడం దారుణంగా అనిపించింది. అయితే ఇటీవల రూమర్స్‌ను పట్టించుకోవడం పూర్తిగా మానేశా. పుకార్ల వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed