- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shivaji and Laya : 14 ఏళ్ల తర్వాత జతకడుతున్న సూపర్ హిట్ జోడి..
దిశ, సినిమా: దాదాపు 14 ఏళ్ల తర్వాత హిట్ కాంబో వస్తుంది. సీనియర్ హీరో శివాజీ, నటి లయ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుంది. శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2 గా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాతో నూతన దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు అండ్ దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు. కాగా.. ఇంతకుముందు శివాజీ, లయ జంటగా నటించిన 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో.. అప్పట్లో ఈ జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు దాదాపు 14 ఏళ్లు తర్వాత వీళ్లు మరోసారి జతకట్టడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. మూవీకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.