మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ఎమోషనల్ ట్వీట్.. విడాకులు తీసుకున్నారా?

by Hamsa |   ( Updated:2023-10-21 02:44:57.0  )
మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ఎమోషనల్ ట్వీట్.. విడాకులు తీసుకున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఆయన ఇటీవల తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ ఈవెంట్‌లో మాస్క్ తీసేసి కనిపించాడు. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రాజ్‌కుంద్రా ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ‘‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’’ అని రాసుకొచ్చాడు. అలాగే గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును కూడా జత చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు శిల్పాశెట్టితో విడాకులు తీసుకున్నారా? అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టారని చర్చించుకుంటున్నారు. రాజ్‌కుంద్రా పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Next Story