ఆ సినిమాలో నటించమని రాజ్ బలవంతం చేశాడు.. భర్తపై శిల్పాశెట్టి కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-09-07 10:56:40.0  )
ఆ సినిమాలో నటించమని రాజ్ బలవంతం చేశాడు.. భర్తపై శిల్పాశెట్టి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రా ‘సుఖీ’ సినిమా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిపింది. సోనాల్ జోషి తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన శిల్పా.. ‘నా మానసిక స్థితి సరిగ్గా లేనందున స్క్రిప్ట్ వినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. నాకు బదులు మరొకరిని తీసుకోవాలని మేకర్స్‌కు చెప్పాను. ఇతర నటీనటుల పేర్లను సూచించాను. అయినా టైమ్ తీసుకోమని నిర్మాతలు ఫోన్ చేసి చెప్పారు.

ఎనిమిది నెలలు వెయిట్ చేశారు. అయితే నేను ఇంట్లో లేనప్పుడు స్క్రిప్ట్ చదివిన రాజ్ ‘స్టోరీ బాగుంది. ఎలాగైనా నువ్వు ఈ సినిమా చేయాలి’ అని చెప్పాడు. నేను ఏవేవో కారణాలు చెప్పినప్పటికీ ‘నీకు పిచ్చా? మంచి స్టోరీ ఎలాగైనా చేయాలి’ అని బలవంతం చేశాడు’ అని తెలిపింది. చివరగా స్త్రీ ప్రాధాన్యతను చూపించే ఇలాంటి సినిమా కోసం ప్రతి పురుషుడు ఆయనలా ఆలోచించగలిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.


Advertisement

Next Story