జాతీయ జెండాను అవమానించిన బాలీవుడ్ నటి.. సిగ్గులేదంటూ నెటిజన్లు ఫైర్

by samatah |   ( Updated:2023-08-16 07:04:40.0  )
జాతీయ జెండాను అవమానించిన బాలీవుడ్ నటి.. సిగ్గులేదంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఇండిపెండెన్స్ వేడుకలు ఘనంగా జరగగా నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతోపాటు ఫ్యామిలీ మొత్తం తమ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే జాతీయ జెండాను ఎగురవేసిన వీడియో, ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసిన శిల్పా.. ‘వందేమాతరం. జైహింద్. 76 సంవత్సరాల స్వాతంత్ర్యం. ప్రౌడ్ ఇండియన్’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆమె చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదించడమే కాదు పద్ధతులు కూడా తెలుసుకోవాలని తిట్టిపోస్తున్నారు. దీంతో వెంటనే స్పందించిన నటి.. ‘జెండా ఎగురవేసేటప్పుడు ప్రవర్తనా నియమాలపై నాకు అవగాహన ఉంది. నా దేశం, జెండా పట్ల ఉన్న గౌరవాన్ని చూడండి. ప్రశ్నించడం కాదు. నేను భారతీయురాలుగా గర్విస్తున్నా. ఈ రోజు సంబురాలు చేసుకోవడం ఓ భావోద్వేగం. నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కాదు. వాస్తవాలను తెలుసుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చింది.

Read More: పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ఈవెంట్ కూడా ప్లాన్ చేసేస్తుందిగా.. (వీడియో)

Advertisement

Next Story