Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ మర్చిపోనంటూ పోస్ట్

by Prasanna |
Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ మర్చిపోనంటూ పోస్ట్
X

దిశ, సినిమా: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసారు. ఆయన ఏ స్టెప్ వేసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాటిలో హుక్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినిమాలు మాత్రమే కాకుండా టీవీ షోలకు జడ్జ్ గా చేస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్ తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందారు. దీని గురించి ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తెలిపారు.

శేఖర్ మాస్టర్ ఎప్పుడూ ఇంత ఎమోషల్ పోస్ట్ షేర్ చేయలేదు. " నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను.. నేను ఎక్కడికెళ్లినా.. నీ జ్ఞాపకాలు బాగా గుర్తొస్తున్నాయి.. నువ్వు మా మధ్య లేవనే విషయాన్ని తల్చుకుంటేనే బాధ వేస్తుంది.. ఈ నిజాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నువ్వు ఎక్కడా ఉన్నా సంతోషంగా ఉంటావని కోరుకుంటున్నా.. నీ లోటు ఎవరు తీర్చలేరు.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు. మిస్‌ యూ రా తమ్ముడు.." అంటూ ఎమోషనల్ గా పోస్టులో రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ పై స్పందించిన నెటిజెన్స్ , సినీ సెలబ్రెటీలు , సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అయితే, అతను ఎలా చనిపోయారన్నది కారణం మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story