Tamannaah Bhatia : శృంగారం సీన్స్ పై ఓపెన్ అయినా తమన్నా

by Prasanna |   ( Updated:2023-06-28 06:31:37.0  )
Tamannaah Bhatia : శృంగారం సీన్స్ పై ఓపెన్ అయినా తమన్నా
X

దిశ, వెబ్ డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. దానికి కారణం నటిస్తున్న సిరీస్ లే. బాలీవుడ్లో ఈ భామ జో ఖర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లలో నటించింది. అంతక ముందు ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోసి.. ఘాటు సీన్స్ పెంచి దేవుడా.. ఈమె అస్సలు తమన్నానేనా అనిపించింది. ఆ సిరీస్ ల వలన తమన్నాను నెటిజన్లు ఏకిపారేసారు. ఇక తాజాగా ఈ విమర్శలకు తమన్నా ఘాటుగానే సమాధానమిచ్చింది . తెలుగు యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని భావాలను బయటపెట్టింది. అలాగే ఇలాంటి సీన్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది. " నేను చాలా సార్లు చూసాను .. అందరి హీరోలు.. ప్రతి సినిమాలో వైలెన్స్ చేస్తారు.. ఇంటిమేటెడ్ సీన్స్ కూడా చేస్తారు. దాని వలన వాళ్లకి మంచి పేరు కూడా వస్తుంది.. కానీ, అదే హీరోయిన్లు చేస్తే మాత్రం ఇది భూతు, పెద్ద తప్పులా చూస్తున్నారు.. ఈ సోషల్ మీడియా అంకుల్స్ .. నాకున్న బాధ ఏంటంటే.. ఎందుకు ఇలా తేడా చూపిస్తున్నారనిపిస్తుంటుంది. ఇంటిమేటెడ్ సీన్స్ హీరోలు చేస్తే స్టార్ హీరోలుగా మారుతున్నారు.. కానీ హీరోయిన్లు చేస్తే మాత్రం తప్పు అంటున్నారు.. కానీ ఇలా ఎందుకు అని ఆమె ప్రశ్నించింది" ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Also Read: రష్మిక విజయ్ దేవరకొండను ఎందుకు లవ్ చేసిందో తెలుసా?

Advertisement

Next Story