Trivikram Srinivas చేతుల మీదుగా Sharwanand కొత్త సినిమా

by Hajipasha |   ( Updated:2022-09-06 06:28:11.0  )
Trivikram Srinivas చేతుల మీదుగా Sharwanand కొత్త సినిమా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌-సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా తొలి షాట్‌కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌ ఇచ్చారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శర్వాకు 33వ చిత్రం కాగా.. విభిన్నమైన కథ, శక్తివంతమైన పాత్రలతో కూడిన పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్రలో న‌టించ‌నున్న సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా.. రెగ్యులర్ షూటింగ్ అక్టోబ‌ర్ నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed