రజనీకాంత్‌కు తలనొప్పిగా మారుతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఉత్కంఠ

by Dishaweb |   ( Updated:2023-08-18 11:04:00.0  )
రజనీకాంత్‌కు తలనొప్పిగా మారుతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఉత్కంఠ
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సరికొత్త క్యారెక్టర్‌లో తన అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘జైలర్’ మూవీతో బిగ్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ణానవేల్‌తో దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలసిందే. కాగా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ మూవీలో అమితాబ్‌ ఓ కీలకపాత్ర చేయనున్నట్లు తెలియడంతో మూవీపై క్యూరియాసిటీ పెరిగిపోగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇందులో నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పటినుంచో విలన్‌ పాత్ర చేయాలని ఆశపడుతున్న శర్వాకు రజనీకాంత్ సినిమాలోనే ఈ అవకాశం రావటంపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చివరగా ఈ ఆఫర్‌ ముందుగా నానికి వచ్చినప్పటికీ సాహసం చేయలేనంటూ రిజెక్ట్ చేయడంతో శర్వాతో మేకర్స్ చర్చలు జరిపినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed